శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 17 నవంబరు 2023 (19:29 IST)

మహేంద్రగిరి వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథతో సుమంత్ చిత్రం

Sumanth- varahi
Sumanth- varahi
రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న ప్రొడక్షన్‌ నెంబరు - 2 సినిమాకు మహేంద్రగిరి వారాహి టైటిల్ ఖరారు చేశారు. శుక్రవారం హీరో సుమంత్ టైటిల్ లోగోను విడుదల చేశారు.  మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కధాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర దర్శకులు జాగర్లపూడి సంతోష్ తెలిపారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై చిత్ర నిర్మాణం జరుగుతోందని, త్వరలో చిత్ర నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు.
 
 సుమంత్, మీనాక్షి గోసామి, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, సత్యసాయి శ్రీనివాస్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు, కాలిపు మధు, ఎం. సుబ్బారెడ్డి నిర్మాతలుగా ఉన్న ఈ సినిమాకు కథ మురళి రచన , దర్శకత్వం సంతోష్ జాగర్లపూడి.