ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 15 నవంబరు 2023 (18:22 IST)

సుధీర్ బాబు హరోం హర’ నుంచి దేవి గా మాళవిక శర్మ

Malavika sharma
Malavika sharma
పవర్ ఆఫ్ సుబ్రమణ్యం నవంబర్ 22న విడుదల కానుంది. అంతకంటే ముందు సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’ మేకర్స్ ప్రధాన పాత్రలను పరిచయం చేస్తున్నారు. సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) పతాకంపై సుమంత్ జి నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
 
తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న మాళవిక శర్మను దేవిగా పరిచయం చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. మాళవిక చీరలో అందంగా, సాంప్రదాయకంగా ఆకట్టుకుంది. ఆమె లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి ముందు నిలబడి చిరునవ్వుతో కనిపిస్తోంది.    
 
ఈ సినిమాలో సునీల్ కీలక పాత్ర పోషిస్తుండగా, ఇటివలే ఆయన క్యారెక్టర్ పోస్టర్‌ను విడుదల చేశారు.చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి నేపథ్యంలో సాగే ‘హరోం హర’ కథలో సుధీర్ బాబు కుప్పం యాసలో డైలాగులు పలకనున్నారు.
 
ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు.  
 
ది రివోల్ట్.. ‘హరోం హర’ ట్యాగ్ లైన్. ఇది సుధీర్ బాబు కెరీర్ లో హై బడ్జెట్‌ మూవీ గా రూపొందుతోంది. 'హరోం హర' తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.