Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

శాక్రిఫైస్ స్టార్ అరెస్ట్: నకిలీ వీడియోలతో ..

Written By సెల్వి
Updated: శనివారం, 2 అక్టోబరు 2021 (09:50 IST)
టాలీవుడ్ హీరోలు మరియు దర్శకులపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ సునిశిత్‌ పాపులర్ అయిన సంగతి తెలిసిందే. అంతే కాదు శాక్రిఫైస్ స్టార్ గా ముద్ర పడిపోయాడు. అయితే తాజాగా మేడ్చల్ జిల్లా కీసర పోలీసులు… సునిశిత్‌ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. నకిలీ వీడియో లను సృష్టించి ఓ పోలీస్ అధికారి పై తప్పుడు ఆరోపణలు చేసిన కేసులో అతడిని అరెస్టు చేశారు పోలీసులు.
 
తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా కు చెందిన సునిశిత్‌ ఓ కాలేజీ లో లెక్చరర్ గా పని చేశాడు. అయితే కాలేజీ లో లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలో… ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ నేపథ్యంలోనే గతంలో జైలుకు వెళ్లాడు సునిశిత్‌.
 
ఆ తర్వాత విడుదలైన సునిశిత్‌… టాలీవుడ్ హీరోలపై సెటైర్లు వేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. అంతేకాదు సినీ ప్రముఖులపై తప్పుడు ప్రచారం చేస్తూ ఓ కేసులో కూడా బుక్కయ్యాడు. ఇక తాజాగా మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లో పనిచేసే ఓ పోలీస్ అధికారి పై తప్పుడు వీడియో పోస్ట్ చేశాడు సునిశిత్‌. అధికారి ఫిర్యాదుతో… కీసర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సునిశిత్‌ ఉద్దేశపూర్వకంగానే తప్పుడు వీడియో పోస్ట్ చేసినట్లు తెలియడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Custard apples సీతాఫలాలు వచ్చాయి, తినేవారు తెలుసుకోవాల్సినవి

Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

తర్వాతి కథనం
Show comments