1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 సెప్టెంబరు 2021 (20:40 IST)

పవన్ కల్యాణ్‌పై సరయు కామెంట్స్... ఆయన ప్రేమలో పడిపోయాను.. (video)

బిగ్ బాస్ షో సీజన్ 5లో పాల్గొని ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన సరయు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో సరయు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ తాను బాల్యం నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లకు పెద్ద అభిమానినని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ మ్యానరిజాన్ని చూసి తాను ప్రేమలో పడిపోయానని సరయు చెప్పుకొచ్చారు. పవన్ అంటే క్రేజ్ అని సరయు వెల్లడించారు.
 
అవకాశం వస్తే పవన్ కళ్యాణ్‌తో ఒక్క సినిమాలో అయినా నటించాలని ఉందని సరయు చెప్పుకొచ్చారు. పవన్ భవిష్యత్తు ప్రాజెక్టులలో సరయుకు ఛాన్స్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది. టాలీవుడ్ అంటే తనకు గౌరవమని చిన్నప్పటి నుంచి తనకు సినిమాలంటే ఇష్టమని సరయు పేర్కొన్నారు. ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో చాలామంది కమిట్ మెంట్ అడిగారని సరయు చెప్పుకొచ్చారు.
 
ఎవరైన కమిట్ మెంట్ అడిగితే బాధ పడేదానినని తన ముఖం అలా కనిపిస్తుందా. అంటూ ఏడ్చేదానినని సరయు వెల్లడించారు. తన మెంటాలిటీకి తగిన వ్యక్తిని తాను మ్యారేజ్ చేసుకుంటానని సరయు చెప్పుకొచ్చారు.