మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 18 జూన్ 2018 (13:54 IST)

నిషా కౌర్‌తో సన్నీ దంపతులు.. అర్ధనగ్నంగా ఇదేంటి? ఛీ కొడుతున్న నెటిజన్స్

పోర్న్ కమ్ బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ మళ్లీ వార్తల్లో నిలిచింది. వెబెర్ దంపతులు గతేడాది మహారాష్ట్రలోని లాతూరుకు చెందిన 21 నెలల నిషా కౌర్‌ను దత్తతకు తీసుకున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో ఈ దంపతులు సరోగసీ

పోర్న్ కమ్ బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్ మళ్లీ వార్తల్లో నిలిచింది. వెబెర్ దంపతులు గతేడాది మహారాష్ట్రలోని లాతూరుకు చెందిన 21 నెలల నిషా కౌర్‌ను దత్తతకు తీసుకున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో ఈ దంపతులు సరోగసీ విధానంలో ఇద్దరు కవల మగ పిల్లలకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే.


ఈ నేపథ్యంలో ఆదివారం ఫాదర్స్ డే కావడంతో సన్నీలియోన్ ఫ్యామిలీ అర్ధనగ్నంగా కనిపించారు. ఈ ఫోటోలపై ప్రస్తుతం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఫోటోలో వెబెర్, సన్నీ దంపతులతో పాటు వారి దత్తపుత్రిక నిషాకౌర్ అర్ధనగ్నంగా కనిపిస్తున్నారు. 
 
నిషా కౌర్‌ను దత్తత తీసుకోవడం ద్వారా తమ జీవితంలో వెలుగులు నిండాయని.. అందుకే ఆమెకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఫోటో తీసినట్లు వెబెర్ చెప్పుకుంటున్నా.. ఫోటో మాత్రం అర్ధనగ్నంగా వుండటం నెటిజన్లు ఆగ్రహానికి కారణమైంది. శరీరంపై సగానికి దుస్తులు లేకుండా ఫోటోలో కనిపించడంపై నెటిజన్లు ఛీ కొడుతున్నారు. 
 
వెబెర్ దంపతులు ఇలాంటి ఫొటోలను వారి వ్యక్తిగత ఆల్బమ్‌లోనే ఉంచుకుంటే బావుంటుందని నెటిజన్లు మండిపడుతున్నారు. కానీ వెబెర్ తన ఇద్దరు కుమారులతో ఉన్న ఫోటోకు మాత్రం నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు.