గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 28 జూన్ 2019 (13:05 IST)

సన్నీని షూట్ చేసిన యువకుడు.. స్పృహ తప్పిపడిపోయింది.. (Video)

పోర్న్ కమ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సన్నీలియోన్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. షూటింగ్ సందర్భంగా ఓ యువకుడు గన్‌తో షూట్ చేస్తే.. సన్నీలియోన్ స్పృహ తప్పి పడిపోయినట్లు గల ఆ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. 
 
సన్నీ ప్రస్తుతం కొక్కక్కోలా అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోలో గన్‌తో షూట్ చేసిన తర్వాత సన్నీ కిందపడిపోతోంది. ఆపై సినిమా సభ్యులు ఎంత లేపినా సన్నీ లేవలేదు. దీంతో వీడియో ముగుస్తోంది. 
 
ఈ వీడియో చివర్లో ఈ వీడియోకు తర్వాత ఏం జరిగిందో చూపెట్టడానికి ఇష్టం లేదని.. దాని కింద గ్రాఫిక్స్ వార్నింగ్ అనే హెచ్చరిక కూడా వుంది. ప్రస్తుతం ఈ వీడియో సన్నీలియోన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయబడింది. 
 
ఈ వీడియోను చూసినవారంతా సన్నీకి ఏమైందని అడుగుతున్నారు. కొందరు కొక్కక్కోలా ప్రమోషన్‌లో భాగంగానే ఈ వీడియోను తీసివుంటారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.