బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 24 అక్టోబరు 2017 (16:02 IST)

సన్నీలియోన్ ఎక్సర్‌సైజ్ క్లాసులు.. ఫిట్‌స్టాప్ పేరుతో.. మొదలు..

టీవీ వ్యాఖ్యాత‌గా ఇప్ప‌టికే ఎంటీవీలో ప్ర‌సార‌మ‌వుతున్న ''స్ప్లిట్స్‌విల్లా'' కార్య‌క్ర‌మానికి స‌న్నీ లియోన్ ప‌నిచేస్తోంది. త్వ‌ర‌లోనే మ‌రో టీవీ కార్య‌క్ర‌మంతో స‌న్నీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సంగీత

''గరుడ వేగ'' సినిమా నవంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజశేఖర్ కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూ.25కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పూజా కుమార్ కథానాయికగా నటించింది. శ్రద్ధా దాస్ కీలకమైన పాత్రను పోషించింది. ఇక పోర్న్ స్టార్ కమ్ సినీ స్టార్ సన్నీలియోన్ చేసిన ఐటమ్ సాంగ్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఇప్పటికే సినీ యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాలో సన్నీ పాట దక్షిణాదిన 
వైరల్ అవుతోంది. 
 
ఇదిలా ఉంటే టీవీ వ్యాఖ్యాత‌గా ఇప్ప‌టికే ఎంటీవీలో ప్ర‌సార‌మ‌వుతున్న ''స్ప్లిట్స్‌విల్లా'' కార్య‌క్ర‌మానికి స‌న్నీ లియోన్ ప‌నిచేస్తోంది. త్వ‌ర‌లోనే మ‌రో టీవీ కార్య‌క్ర‌మంతో స‌న్నీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సంగీతాన్ని, ఎక్స‌ర్‌సైజ్‌ల‌ను మేళ‌విస్తూ ఎంటీవీ బీట్స్ ఛాన‌ల్‌లో "ఫిట్‌స్టాప్‌" పేరుతో స‌న్నీ లియోన్ ఓ కార్య‌క్ర‌మాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ కార్య‌క్ర‌మం ద్వారా మంచి ఎక్స‌ర్‌సైజ్‌ల‌ను ప్రేక్షకుల‌కు ప‌రిచ‌యం చేయ‌నుంది. 
 
మాన‌సికంగా, శారీరంగా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అవసరమనే దానిపై సన్నీ వివరించనుంది. ప్రతి ఒక్కరూ తమ రోజులో కొంత సమయాన్ని వ్యాయామం కోసం వెచ్చించాలని చెప్తోంది. సన్నీలియోన్ ప్రోగ్రామ్స్‌కు ఇప్పటికే మంచి క్రేజ్ వస్తున్న తరుణంలో.. ఫిట్ స్టాప్ కూడా క్రేజ్ కొట్టేస్తుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.