శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 3 మార్చి 2022 (22:47 IST)

ర‌జ‌నీకాంత్ త‌ర్వాత సూర్యానే - బోయ‌పాటి శ్రీ‌ను

Surya- Boyapati
సూర్య న‌టించిన‌ యాక్షన్ థ్రిల్లర్ `ఇటి`  (ఎవ‌రికీ త‌ల‌వంచ‌డు). పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ  ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను విడుదల చేస్తోంది. తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మార్చి 10 విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా గురువారం రాత్రి సూర్య ఇటీ (ఎవ‌రికీ త‌ల‌వంచ‌డు) ప్రీ రిలీజ్ వేడుక హైద‌రాబాద్ ద‌స్‌ప‌ల్లాలో అభిమానుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది.

 
ఈ సంద‌ర్భంగా అతిథి బోయ‌పాటి శ్రీ‌ను మాట్లాడుతూ, రామ్ ల‌క్ష్మ‌ణ్ ఫైట్సే కాదు మాట‌లు కూడా బాగా చెబుతారని ఈ స్టేజీమీద మాట‌ల‌బ‌ట్టి అర్థ‌మైంది. సూర్య‌గారు ఛారిటీ ద్వారా గుండెజ‌బ్బు వున్న‌వారికి హృద‌య‌పూర్వ‌కంగా సాయం చేస్తున్నారు. ఈ ఛారిటీ వ‌ల్ల సూర్య‌గారి జ‌న‌రేష‌న్ అంతా బాగుంటారు. ఈ ఛారిటీ అనేది తెలుగులోనూ కేన్స‌ర్ ఆసుప‌త్రి ద్వారా బాల‌య్య‌బాబు, మెగాస్టార్ చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్‌తోనూ సేవ‌లు చేస్తున్నారు. సూర్య‌లాంటి మంచి మ‌న‌సు వున్న‌వారు మ‌న‌కు చాలా అవ‌స‌రం.


తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాష‌తో సంబంధంలేకుండా మంచి సినిమాల‌ను ఆద‌రిస్తారు. సూర్య సినిమా మ‌న సినిమా అని ఫీల‌వుతారు. ర‌జ‌నీకాంత్ త‌ర్వాత సూర్య అంటే మ‌న‌వాడు అని తెలుగు ప్రేక్ష‌కులు ఓన్ చేసుకున్నారు. అలాంటి సూర్య‌గారి నుంచి వ‌స్తున్న ఇ.టి. సినిమా ప్రేక్ష‌కులు ఆద‌రించే సినిమా అవ్వాల‌ని కోరుకుంటున్నాను. ఆకాశ‌మే నీ హ‌ద్దురా, జైభీమ్ వంటి సినిమాల‌ను బ‌యోపిక్‌లుగా చేసి అద్భుతంగా పండించారు. నా టైం కుదిరిన‌ప్పుడు సూర్య‌గారికి  స‌మ‌యం చిక్కిన‌ప్పుడు త‌ప్ప‌కుండా సినిమా చేస్తాను.. అఖండ‌, పుష్ప‌, భీమ్లానాయ‌క్ తో తెలుగు సినిమా నిండుకుండ‌లా వుంది. అందులో ఇ.టి. కూడా  వుండాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.