శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 1 జనవరి 2022 (16:08 IST)

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ నుంచి స్వాగ్ ఆఫ్ భోళా వ‌చ్చింది

Bhola Shankar
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మాసివ్ యాక్షన్ ఎంటర్ టైనర్ "భోళా శంకర్". ఈ చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ మేహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా శ‌నివారంనాడు ఈ సినిమాలోని ప్రీ లుక్ పోస్టర్ స్వాగ్ ఆఫ్ భోళాను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.
 
స్వాగ్ ఆఫ్ భోళాలో కంప్లీట్ మాస్ లుక్ లో ఉన్న మెగాస్టార్ స్టైలిష్ మేకోవర్ అదిరిపోయింది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కు స్వాగ్ ఆఫ్ భోళా న్యూ ఇయర్ గిఫ్ట్ గా భావించవచ్చు. స్వాగ్ ఆఫ్ భోళాతో పాటు సినిమా థీమ్ మ్యూజిక్ తో విడుదల చేసిన మోషన్ వీడియో కూడా ఆకట్టుకుంటోంది.
 
మెగాస్టార్ సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ తమన్నా నటిస్తున్న భోళా శంకర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో కీలక షెడ్యూల్ ను ఇటీవలే కంప్లీట్ చేశారు. కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా కనిపించనుంది.
 
యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. డడ్లీ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథా పర్యవేక్షణ సత్యానంద్.. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఏ ఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, కిషోర్ గరికపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
నటీనటులు - చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రశ్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు
 
సాంకేతిక నిపుణులు- సంగీతం - మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫీ - డూడ్లే
స్టోరీ సూపర్ విజన్ - సత్యానంద్
ఎడిటర్ - మార్తాండ్ కె వెంకటేష్
ప్రొడక్షన్ డిజైనర్ - ఏఎస్ ప్రకాష్
మాటలు - తిరుపతి మామిడాల, ఫైట్ మాస్టర్స్ - రామ్ లక్ష్మణ్,  దిలీప్ సుబ్బరాయన్, కియోచి కంపాక్డీ
కొరియోగ్రఫీ - శేఖర్ మాస్టర్
సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యాం, శ్రీమణి, సిరాశ్రీ
పబ్లిసిటీ డిజైనర్ - అనిల్ భాను
డిజిటల్ మీడియా హెడ్ - విశ్వ సీఎం
లైన్ ప్రొడక్షన్ - మెహర్ క్రియేషన్స్
బ్యానర్ - ఏకే ఎంటర్ టైన్ మెంట్స్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - కిషోర్ గరికపాటి
నిర్మాత - రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం - మెహర్ రమేష్