ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 26 సెప్టెంబరు 2018 (14:47 IST)

నానా పటేకర్ కూడా అలాంటివాడేనా? ఆ హీరోయిన్‌ను కోర్కె తీర్చమన్నాడా?

బాలీవుడ్ నటు నానా పటేకర్‌పై నటి తనూశ్రీ దత్తా సంచలన ఆరోపణలు చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సమయంలో లైంగిక కోర్కె తీర్చమని నానా పటేకర్ వేధించాడని ఆమె ఆరోపించింది.

బాలీవుడ్ నటు నానా పటేకర్‌పై నటి తనూశ్రీ దత్తా సంచలన ఆరోపణలు చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సమయంలో లైంగిక కోర్కె తీర్చమని నానా పటేకర్ వేధించాడని ఆమె ఆరోపించింది.
 
గత 2005 సంవత్సరంలో వచ్చిన బాలీవుడ్ చిత్రం "అషిక్ బనాయా అప్నే". ఈ చిత్రంతో ఆమె వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. పైగా, ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది కూడా. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. 2010లో ఇండస్ట్రీనివీడి అమెరికాకు వెళ్లిపోయిన తనూశ్రీ దత్తా... ఇటీవలే స్వదేశానికి తిరిగివచ్చింది. ఇలాతిరిగి వచ్చిన తనూశ్రీ, బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై సంచలన ఆరోపణలు చేసింది. 
 
'హార్న్ ఓకే ప్లీజ్' సినిమా సమయంలో నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడంటూ విమర్శలు గుప్పించింది. ఆసమయంలో ఆ విషయాన్ని దర్శక నిర్మాతలకు చెప్పినా పెద్దగా పట్టించుకోలేదని వాపోయింది. 2008లో జరిగిన ఈ ఇష్యూ గురించి తనూశ్రీ ఇప్పుడు బయటపెట్టడంతో.. బాలీవుడ్‌లో ఒక్కసారిగా సంచలనంగా మారింది. మరి తనూశ్రీ దత్తా చేసిన ఈ వ్యాఖ్యలపై నానా పటేకర్ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.