సైనా నెహ్వాల్‌గా శ్రద్ధా కపూర్... మరో బయోపిక్ షూటింగ్ స్టార్ట్

బాలీవుడ్‌లో ఇప్పుడు బయోపిక్‌ల హవా నడుస్తోంది. అందులో కూడా క్రీడాకారుల జీవితాలకు సంబంధించిన సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. తాజాగా మన తెలుగు రాష్ట్రం తెలంగాణకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా మరో బయోపిక్ సినిమా తెరకెక్కనుం

Sradha Kapoor
kumar| Last Modified బుధవారం, 26 సెప్టెంబరు 2018 (12:39 IST)
బాలీవుడ్‌లో ఇప్పుడు బయోపిక్‌ల హవా నడుస్తోంది. అందులో కూడా క్రీడాకారుల జీవితాలకు సంబంధించిన సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. తాజాగా మన తెలుగు రాష్ట్రం తెలంగాణకు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా మరో బయోపిక్ సినిమా తెరకెక్కనుంది.
 
సైనా నెహ్వాల్ పాత్రలో శ్రద్ధా కపూర్ నటిస్తున్న ఈ సినిమాకు "సైనా" అనే టైటిల్‌ను ఖరారు చేసారు. శ్రద్ధా కపూర్ 'సాహో' సినిమా చివరి షెడ్యూల్‌లో బిజీగా ఉండటంతో అది పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాకు అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తుండగా టి-సిరీస్ అధినేత భూషణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న హీరోయిన్‌లలో శ్రద్ధా కపూర్ ఒకరు కావడం వల్ల ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు పెంచేసుకుంటున్నారు అభిమానులు. మరి "సైనా"కు శ్రద్ధా కపూర్ ఎంతమేరకు న్యాయం చేస్తుందో వేచి చూడాలి.దీనిపై మరింత చదవండి :