ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (16:02 IST)

ఆ డైరెక్టర్ నన్ను దుస్తులు విప్పేసి నగ్నంగా డ్యాన్స్ చేయాలన్నాడు...

తనుశ్రీ దత్తా వరుసబెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలోని నటులు, దర్శకుల వ్యవహార శైలికి సంబంధించి సంచలన విషయాలను బయటపెడుతోంది. మొన్నటికిమొన్న తనను నానా పటేకర్ లైంగికంగా వేధించాడని ఆరోపించిన తనూశ్రీ తాజాగా మరో బాంబు పేల్చింది.

తనుశ్రీ దత్తా వరుసబెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలోని నటులు, దర్శకుల వ్యవహార శైలికి సంబంధించి సంచలన విషయాలను బయటపెడుతోంది. మొన్నటికిమొన్న తనను నానా పటేకర్ లైంగికంగా వేధించాడని ఆరోపించిన తనూశ్రీ తాజాగా మరో బాంబు పేల్చింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది.
 
షూటింగ్ సమయంలో ఓ పాటకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుండగా తనను దుస్తులు విప్పేసి నగ్నంగా డ్యాన్స్ చేయాలంటూ వేధించాడని వెల్లడించింది. ‘చాకొలెట్‌: డీప్‌ డార్క్‌ సీక్రెట్స్‌’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఇది జరిగిందని వెల్లడించింది. దుస్తులు విప్పేసి డ్యాన్స్ చేయాలంటూ అతడు వేధిస్తుండగా అక్కడే వున్న సునీల్ శెట్టి, ఇర్ఫాన్ ఖాన్ తనను కాపాడారంటూ చెప్పుకొచ్చింది. కాగా ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పైన కంగనా రనౌత్ తదితర స్టార్ హీరోయిన్లు మాట్లాడిన సంగతి తెలిసిందే.