మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: సోమవారం, 22 ఏప్రియల్ 2019 (18:34 IST)

డబ్బు కోసం ఆ హీరో రేప్‌లు కూడా చేస్తారు - తనుశ్రీ దత్తా సంచలన వ్యాఖ్యలు

అజయ్ దేవగన్‌కి డబ్బు పిచ్చి పట్టింది. డబ్బు కోసం అవసరమైతే హీరోయిన్లను రేప్ కూడా చేస్తాడని ఘాటుగా విమర్సించింది ఓ హీరోయిన్. అజయ్ దేవగణ్ ఈ కామెంట్స్‌తో షాక్ తిన్నాడు. ఇంతకీ ఎవరా హీరోయిన్.. ఏమిటా వివాదం..
 
అజయ్ దేవగణ్ పైన విరుచుకుపడింది హీరోయిన్ తనుశ్రీ దత్తా. బాలీవుడ్‌లో MeToo ఉద్యమానికి ఊపు తీసుకువచ్చిన నటి తనుశ్రీ దత్తా. నానా పటేకర్ తనను ఎలా వేధించాడో అందరికీ తెలియజేసింది. అయితే ఆమె ఇప్పుడు అజయ్ దేవగణ్‌ను టార్గెట్ చేసింది. అజయ్ దేవగణ్ తాజాగా నటించిన దీదీ ప్యార్ దీదీ సినిమాలో అలోక్ నాథ్ కూడా నటించారు. అలోక్ నాథ్ తమను లైంగికంగా వేధించాడని పలువురు నటీమణులు ఆరోపించారు.
 
అలాంటి ఆరోపణలు ఉన్న వ్యక్తితో కలిసి ఎలా నటిస్తావంటూ అజయ్ దేవగణ్‌ను ప్రశ్నించింది తను శ్రీ దత్తా. ఈ సినిమాలో అలోక్ నాథ్ ఉన్న సీన్లు అన్నింటినీ తొలగించి సినిమాను రిలీజ్ చేయాలన్నదే తనుశ్రీ దత్తా డిమాండ్. అయితే తనుశ్రీ దత్తా వ్యాఖ్యలపై మాత్రం అజయ్ దేవగణ్ ఏ మాత్రం స్పందంచలేదు.