గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 సెప్టెంబరు 2022 (22:08 IST)

తారక్ రెమ్యునరేషన్ పెరిగిందా..? రాజకీయాల సంగతేంటి?

Tarak, Trivikram
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ రెమ్యూనరేషన్ భారీగా పెరిగిందని టాక్ వస్తోంది. ప్రస్తుతం కెరీర్ విషయంలో తారక్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిసింది. 
 
తాజాగా తారక్‌కు దేశవిదేశాల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక కొరటాల శివ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన తర్వాత తారక్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌తో బిజీ కానున్నారు. 
 
గత సినిమాలు సక్సెస్ సాధించడంతో తారక్ ప్రస్తుతం రెమ్యునరేషన్ భారీగా పెరిగిందని బోగట్టా. కెరీర్ విషయంలో తారక్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. 
 
ఇక రాజకీయాల్లో క్రియాశీలకంగా దిగుతారా అనే దానిపై చర్చ సాగుతోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు గురించి తారక్ ఇప్పటికే స్పందించారు. 
 
వైసీపీపై మరీ తీవ్రస్థాయిలో విమర్శలు చేయకుండానే తారక్ స్పందించడం గమనార్హం. అయితే తారక్ స్పందించనంత వరకు ఒక విధంగా ట్రోల్ చేసిన నెటిజన్లు తారక్ స్పందించిన తర్వాత మరో విధంగా ట్రోల్ చేస్తున్నారు.