బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 16 ఏప్రియల్ 2018 (17:32 IST)

#TaxiwaalaTeaserOn18thApril: అర్జున్ రెడ్డి ''టాక్సీవాలా'' పోస్టర్‌ను లుక్కేయండి..

అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. యూత్‌లో విజయ్ దేవరకొండకు అమాంతం క్రేజ్ వుంది. ప్రస్తుతం అర్జున్ రెడ్డి చేతిలో బోలెడు సినిమాలున్నాయి. ఈ సినిమాల్లో ముందుగా ''టాక్సీవాలా'' రాన

అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. యూత్‌లో విజయ్ దేవరకొండకు అమాంతం క్రేజ్ వుంది. ప్రస్తుతం అర్జున్ రెడ్డి చేతిలో బోలెడు సినిమాలున్నాయి. ఈ సినిమాల్లో ముందుగా ''టాక్సీవాలా'' రానుంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా మే 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం టాక్సీవాలా పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
 
ఇక ''నోటా'' అనే ద్విభాషా చిత్రం షూటింగ్‌లోనూ అర్జున్ రెడ్డి పాల్గొంటున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన భరత్ కమ్మ అనే దర్శకుడితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమా జూన్ నుంచి ప్రారంభం కానుంది. 
 
ఇందులో అర్జున్ రెడ్డి కాలేజ్ స్టూడెంట్‌గా కనిపించనుంది. రష్మిక మందన క్రీడాకారిణిగా కనిపించనుంది. ఈ సినిమా అర్జున్ రెడ్డికి మంచి గుర్తింపు సంపాదించిపెడుతుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. ఇంకేముంది.. 18వ తేదీన విడుదల కానున్న టాక్సీవాలా ట్రైలర్‌కు ముందు నెట్టింట వైరల్ అవుతున్న టాక్సీవాలా పోస్టర్‌ను ఓ లుక్కేయండి.