శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 14 జనవరి 2018 (16:11 IST)

ఎం.ఎల్.ఏగా నందమూరి కళ్యాణ్ రామ్ (వీడియో)

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న "ఎంఎల్‌ఏ" సినిమా టీజర్ రిలీజైంది. సంక్రాంతి కానుకగా 39 సెకన్లున్న ఈ టీజర్‌ను ఆదివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది.

నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న "ఎంఎల్‌ఏ" సినిమా టీజర్ రిలీజైంది. సంక్రాంతి కానుకగా 39 సెకన్లున్న ఈ టీజర్‌ను ఆదివారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకు మంచి లక్షణాలున్న అబ్బాయి అన్నది ట్యాగ్ లైన్. టీజర్‌లో "వస్తున్నాడు వచ్చేస్తున్నాడు మన ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ.." అన్న డైలాగ్‌ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది.
 
ఎమ్మెల్యే గెటప్‌లో హీరో స్టైల్‌గా కళ్లద్దాలు పెట్టుకోవడం, కండువా వేసుకోవడం ఆకట్టుకుంటోంది. ఇందులో కల్యాణ్‌‌రామ్‌కి సరసన కాజల్ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 'లక్ష్మీ కల్యాణం' తర్వాత కల్యాణ్‌రామ్‌, కాజల్‌ జంటగా నటిస్తున్న రెండో సినిమా ఇది. ఉపేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భరత్‌ చైదరి, కిరణ్‌ రెడ్డి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది.