మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 4 జనవరి 2018 (09:20 IST)

గర్ల్‌‍ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేసేందుకు... ఎమ్మెల్యేనంటూ సర్క్యూట్ హౌస్‌లో రూమ్

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యాపారి బండారం బయటపడింది. ఇంతకాలం భార్యకు తెలియకుండా గుట్టుచప్పుడుకాకుండా సాగిస్తూ వచ్చిన రాసలీలల గుట్టుబయటపడింది.

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యాపారి బండారం బయటపడింది. ఇంతకాలం భార్యకు తెలియకుండా గుట్టుచప్పుడుకాకుండా సాగిస్తూ వచ్చిన రాసలీలల గుట్టుబయటపడింది. గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేసేందుకు ఎమ్మెల్యేనంటూ చెప్పుకుని, సర్క్యూట్ హౌస్‌లో గదిని బుక్ చేసుకున్నాడు. ఆ తర్వాత తన ప్రియురాలితో అక్కడే వారం రోజుల పాటు తిష్టవేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జార్ఖండ్‌కు చెందిన వ్యాపారి అమరేంద్ర కుమార్ సింగ్ ఓ భార్య షాలినీ దేవి, కుమార్తె ఉంది. అయితే, ఈయన స్త్రీలోలుడు. పలువురు అమ్మాయిలతో పరిచయం ఉంది. వారితో వారానికో ప్రాంతానికి తీసుకెళుతూ ఎంజాయ్ చేసేవాడు. 
 
ఇందుకోసం తాను ఎమ్మెల్యేనని చెప్పుకునేవాడు. ఇదేవిధంగా బీహార్‌ రాష్ట్రానికి వెళ్లి ఆ రాష్ట్ర ప్రభుత్వం సర్క్యూట్ హౌస్‌లో గది బుక్ చేసుకున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌తో ఏడు రోజుల పాటు అక్కడే బస చేసి ఎంజాయ్ చేశాడు. ఈ విషయం ఆయన భార్యకు తెలియడంతో ఆమె గుట్టు బహిర్గతమైంది. 
 
దీనిపై అమరేంద్ర భార్య మాట్లాడుతూ, అమరేంద్రకు పెళ్లయ్యిందని, అతను ఎమ్మెల్యే కాదని, ఒక కుమార్తె ఉందని, అయినా చాలామంది గర్ల్‌ఫ్రెండ్స్‌తో తిరుగుతుంటాడని ఆరోపిస్తూ, బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు.. పరారీలో ఉన్న అమరేంద్ర కుమార్ కోసం గాలిస్తున్నారు.