ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2022 (07:33 IST)

చిత్రపరిశ్రమలో కమిట్మెట్ అనేది సహజం : తేజస్వి మదివాడ

Tejaswi madivada
చిత్రపరిశ్రమలో కమిట్మెట్ అనేది సహజమని, అది పచ్చినిజం కూడా అని టాలీవుడ్ హీరోయి తేజస్వి మదివాడ చెప్పారు. తాను ఇతర ప్రాంతాలకు ఈవెంట్లకు వెళ్లినపుడు అనేక మంది చుట్టూ చేరి పలు రకాలుగా వేధించేవారన చెప్పారు. ఇలాంటి చేదు అనుభవాలను తాను చాలానే ఎదుర్కొన్నట్టు చెప్పారు. 
 
సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే అనేక మంది హీరోయిలు పలు వేదికలపై బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఇందులో బడా హీరోయిన్లు సైతం ఉన్నారు. అయితే, తాజాగా ఇదే అంశంపై బిగ్ బాస్ ఫేమ్, నటి తేజస్వి మదివాడ మాట్లాడుతూ, తాను కూడా చేదు అనుభవాలను ఎదుర్కొన్నట్టు చెప్పారు. 
 
చిత్రపరిశ్రమలో కమిట్మెంట్ అడుగుతారనేది పచ్చి నిజమన్నారు. తనను కూడా ఎంతో మంది కమిట్మెంట్ అడిగారని తెలిపింది. ప్రతి రంగంలో ఇలాంటివి ఉంటాయని... వారికి లొంగిపోకుండా, ధైర్యంగా ఉండాలని చెప్పింది. 
 
అలాంటి వాళ్లకు లొంగిపోయి ఆ తర్వాత మోసపోయాం అని చెప్పడం సరైంది కాదన్నారు. తాను సినిమాలు చేస్తూనే ఈవెంట్లకు వెళ్లేదాన్నని... ఈవెంట్లకు వెళ్లినప్పుడు జనాలు ఫుల్లుగా తాగి తన చుట్టూ చేరి వేధించేవారని... వారి నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడేదాన్నని చెప్పుకొచ్చింది.