శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (17:33 IST)

ప్రముఖ యాంకర్, కలిసుందాం రా నటి మల్లిక మృతి.. రెండు వారాలు కోమాలోనే వుండి?

ప్రముఖ టీవీ యాంకర్, సినీ నటి మల్లిక కన్నుమూశారు. తొలి తరం టీవీ యాంకర్‌గా పేరుతెచ్చుకున్న మల్లిక అనారోగ్యం కారణంగా కోమాలో వున్నారు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించి బెంగళూరులో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచార

ప్రముఖ టీవీ యాంకర్, సినీ నటి మల్లిక కన్నుమూశారు. తొలి తరం టీవీ యాంకర్‌గా పేరుతెచ్చుకున్న మల్లిక అనారోగ్యం కారణంగా కోమాలో వున్నారు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించి బెంగళూరులో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మల్లిక మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

ఆమె కుటుంబసభ్యులకు సినీ తారలు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఆమె అంత్యక్రియలు మంగళవారం హైదరాబాద్‌లో జరగనున్నాయి. 
 
మరణించేనాటికి మల్లికకు 39 సంవత్సరాలు. భర్త బెంగళూరులో ఉద్యోగం చేస్తుండటంతో ఆమె అక్కడే నివాసం వున్నారు. మల్లికకు ఓ కుమారుడు ఉన్నాడు. అనారోగ్యంతో రెండు వారాల పాటు కోమాలోకి వెళ్లిపోయిన మల్లిక.. అసలు పేరు అభినవ.

వెంకటేష్ కలిసుందాం రా, నిన్నే పెళ్ళాడుతా వంటి పలు  సినిమాల్లో ఆమె నటించారు. యాంకర్‌గా, సీరియల్ నటిగా ప్రేక్షకుల ఆదరణ పొందిన మల్లిక దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1999లో కృష్ణగారి రాజకుమారుడు చిత్రంలోనూ నటించారు.