సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2020 (14:54 IST)

మంచి స్నేహితుడే కాదు.. నాకు సరైన భాగస్వామి : సునీత

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ నేపథ్యగాయకురాలు సునీత రెండో పెళ్లి చేసుకోనుంది. ఈ పెళ్లికి సంబంధించిన నిశ్చితార్థం సోమవారం జరిగింది. ప్రముఖ మీడియా టైకూన్ రామ్ వీరపనేనిని ఆమె రెండో పెళ్లి చేసుకోనుంది. 
 
ఈ నిశ్చితార్థంపై ఆమె ఓ ట్వీట్ చేశారు. 'ప్రతి తల్లి మాదిరే తాను కూడా తన పిల్లలను మంచిగా సెటిల్ చేయాలనే కలలు కన్నాను. ఆ క్షణం ఇప్పుడు వచ్చిందని... తన జీవితంలో రామ్ ప్రవేశించాడు. రామ్ ఒక మంచి స్నేహితుడే కాదు... ఒక మంచి భాగస్వామి కూడా. వైవాహిక బంధంతో తామిద్దరం ఒకటి కాబోతున్న తరుణంలో చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే తాము పెళ్లి చేసుకోబోతున్నాం. తన వ్యక్తిగత జీవితాన్ని అర్థం చేసుకున్న అందరికీ ధన్యవాదాలు చెపుతున్నాను.  ఇంతకాలం మీరు అందించిన ప్రేమాభిమానాలను ఇకపై కూడా అందిస్తారని ఆశిస్తున్నా అంటూ ట్వీట్‌ చేసింది. 
 
కాగా, సునీతకు 19 యేళ్ల వయసులో వివాహంకాగా, మొదటి భర్త ద్వారా ఇద్దరు సంతానం కలిగింది. ఆ తర్వాత భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ఆమె విడాకులు తీసుకుంది. ఆ తర్వాత గత కొన్నేళ్లుగా ఒంటరి జీవితం గడుపుతూ వచ్చిన సునీత.. ఇపుడు రెండో వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది. నిజానికి ఈ రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో పలు రకాలైన కథనాలు వచ్చాయి. వీటిపై గతంలో ఎన్నడూ క్లారిటీ ఇవ్వని సునీత.. సోమవారం తేల్చిపారేశారు.