శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2020 (13:23 IST)

మరోమారు పెళ్లి కూతురు కానున్న గాయని సునీత!

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ గాయని సునీత మరోమారు పెళ్లి పీటలెక్కనుంది. ఆమె ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేని అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకోనుంది. 
 
గాయని సునీతకు 19 ఏళ్ల వయసులోనే పెళ్లి అయింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా సునీత తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. అలా చాలా సంవత్సరాలుగా భర్తకు దూరంగా జీవిస్తోంది. ఆ తర్వాత భర్త నుంచి విడాకులు తీసుకుంది.
 
ఈ క్రమంలో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, వీటిపై ఆమె ఎక్కడా స్పందించలేదు. పైగా, ఈ వార్తలను ఖండిస్తూ వచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఆమె ఉన్నట్టుండి మరో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు.
 
ప్రముఖ వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో సోమవారం ఉదయం ఆమె నిశ్చితార్థం జరిగింది. ఇంట్లోనే చాలా నిరాడంబరంగా నిశ్చితార్థ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా సునీత సిగ్గుపడుతూ దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.