గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (17:35 IST)

పేర్నినానితో సినీ నిర్మాతల భేటీ: జనసేనాని ఎలా స్పందిస్తారో?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలతో రెండు రాష్ట్రాల రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. ఏపీ సర్కార్‌ తీసుకు వస్తున్న ఆన్‌ లైన్‌ టికెట్‌ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ… పవన్‌ కళ్యాణ్‌ సీరియస్‌ అయ్యారు.

ఇక పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలకు కూడా ఏపీ మంత్రులు కౌంటర్‌ ఇచ్చారు. అయితే… ఈ నేపథ్యంలో మచిలీపట్నం లో ఏపీ మంత్రి పేర్నినానితో నిర్మాత దిల్‌ రాజు భేటీ అయ్యారు.
 
నిర్మాత దిల్‌ రాజ్‌‌తో పాటు…. పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు కూడా హాజరైనట్లు సమాచారం అందుతోంది. ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయం, సినిమా పరిశ్రమ సమస్యలపై ఈ సందర్భంగా ఏపీ మంత్రి పేర్ని నానితో చర్చలు చేస్తున్నారు టాలీవుడ్‌ ప్రముఖులు.

ఏపీ ప్రభుత్వంపై పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలతో దిల్‌ రాజు, మరియు పేర్ని నాని భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే…దీనిపై జనసేన ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.