సినీ కార్మికులు బాగుండాలని ప్రభుత్వం కోరుకుంటోంది- తలసాని శ్రీనివాస యాదవ్
భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ వేడుక యూసుఫ్ గూడా పోలీస్ స్టేడియంలో జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ, 25వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఏడాదినుంచి పవన్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తెలుగు పరిశ్రమ హైదరాబాద్ హబ్‌గా వుండాలని సినిమారంగానికి సంబంధించి అన్ని అంశాల విషయంలో సింగిల్ విండోస్, 5వ షోలు, టికెట్ రేట్ల విషయంలో ముఖ్యమంత్రి కె.సి.ఆర్., కె.టి.ఆర్. ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మేం కోరుకునేది పరిశ్రమలోని 24 శాఖలు లక్షలాది కార్మికులు బాగుండాలని ప్రభుత్వం కోరుకుంటోంది. 24 సంవత్సరాల క్రితం హీరోగా పవన్ వస్తే రోజురోజు క్రేజ్ పెరుగుతోంది. ఈ సినిమా ప్రపంచంలోనూ బాగా ఆడాలని మా నిర్మాతకు డబ్బులు రావాలని ఆశిస్తున్నాను.
పవన్ టేస్ట్ ఏమంటే. మారుమూల కళాకారుల్ని బయటకు తీసుకువచ్చి \అవకాశం ఇవ్వడం మంచి పరిణామం అని తెలిపారు.
మూడు సార్లు ఫెయిల్ అయ్యా
దర్శకుడు సాగర్ మాట్లాడుతూ, నేను నల్లగొండ నుంచి వచ్చాను. 2011లో అసిస్టెంట్ దర్శఖుడిగా వచ్చాను. పంజా ఆడియో జరుగుతోంది. పవన్ ను కలవడానికి మూడు సార్లు ఫెయిల్ అయ్యాను. ఇప్పటికీ సాధ్యపడింది. నా చుట్టూ వున్న వారివల్లే ఇలా పవన్ గారితో సినిమా చేయడం జరిగింది. రానా దగ్గుబాటు కమిట్‌మెంట్, ఎనర్జీ వున్న వ్యక్తి. రానాలాగా బతకాలనుకుంటున్నాను అని చెప్పారు.