గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (10:59 IST)

ప్రభాస్‌ స్పిరిట్‌ కొత్త అప్‌అప్‌డేట్‌ వచ్చే ఏడాది ప్రారంభం

Sprit poster
Sprit poster
రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ సినిమా స్పిరిట్‌ చిత్రం ఎప్పటినుంచో సెట్‌పైకి ఎక్కనుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో కల్కి 2898 సినిమా చేస్తున్నాడు. మరోవైపు దర్శకుడు మారుతి సినిమాలో నటించనున్నారు. తాజాగా మోహన్‌బాబు దర్శకత్వంలో మంచు విష్ణు కాంబినేషన్‌లో భక్తకన్నప్ప సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇప్పుడు స్పిరిట్‌ గురించి కొత్త అప్‌డేట్‌ వచ్చింది. 
 
ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అధ్యక్షుడు ఇచ్చిన సమాచారం ప్రకారం జూన్‌ 2024న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇది ప్రభాస్‌కు 25వ సినిమా. ఈ సినిమాను ఎనిమిదికి పైగా విదేశీ భాషల్లో విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాకు బాలీవుడ్‌లో రణబీర్‌ కపూర్‌తో యానిమల్‌ సినిమా తెరకెక్కిస్తున్న సందీప్‌రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం చేయనున్నారు. ఇక స్పిరిట్‌ ప్రీప్రొడక్షన్‌ పనులు ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభంకానుంది.