శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 9 నవంబరు 2023 (16:23 IST)

టాలీవుడ్ ఫస్ట్ ఇంటరాగేటివ్ ఫిల్మ్ గా ది ట్రయల్

The Trial poster
The Trial poster
స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా ది ట్రయల్. ఈ సినిమాను ఎస్ఎస్ ఫిలింస్, కామన్ మ్యాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ది ట్రయల్ చిత్రాన్ని టాలీవుడ్ ఫస్ట్ ఇంటరాగేటివ్ ఫిల్మ్ గా దర్శకుడు రామ్ గన్ని రూపొందించారు. స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించారు. సుదర్శన్ రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.
 
ది ట్రయల్ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ కు మంచి స్పందన వచ్చింది. థియేటర్స్ లోనూ సినిమాకు ఇదే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ది ట్రయల్ టీమ్ ఆశిస్తున్నారు. ఈ నెల 24న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ది ట్రయల్ సినిమా ఇప్పటిదాకా తెలుగు తెరపై చూడని కంప్లీట్ ఇంటరాగేటివ్ కథతో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇస్తుందని చిత్రబృందం నమ్మకంతో చెబుతున్నారు.