శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 29 మే 2023 (17:02 IST)

మేమ్‌ ఫేమస్‌ సినిమాను కావాలని తొక్కేస్తున్నారట

Mem famous team
Mem famous team
దాదాపు 45 మంది కొత్తవారితో తీసిన సినిమా మేమ్‌ ఫేమస్‌. తెలంగాణలో మారు మూల గ్రామంలో యూట్యూబ్‌లో స్కిడ్స్‌ చేసుకుంటున్న కొందరిని ఫేమస్‌చేయాలని ఛాయ్‌ బిస్కెట్‌ అనే నిర్మాణ సంస్థ సినిమా తీసింది. ఇటీవలే విడుదలైంది. సినిమా విడుదలకుముందు చిత్ర యూనిట్‌ చేసిన సందడి అంతా ఇంతకాదు. విజయ్‌ దేవరకొండ లెవల్లో బిల్డప్‌లు ఇస్తుండేవాడు నటుడు, దర్శకుడు సుమంత్‌ ప్రభాస్‌. నా నైజం అంతే అనేవాడు. పబ్లిసిటీ పరంగా ఓవర్‌గా వెళ్ళారు. దీనికి సోషల్‌ మీడియాలో సెటైర్లు పడ్డాయి. 
 
కట్‌ చేస్తే, మొన్ననే సినిమా విడుదలైంది. డివైడ్‌ టాక్‌ వచ్చింది. కానీ సినిమాను చూడొద్దు. టైం వేస్టు అంటూ కొందరు, అసలు ఇది సినిమానా? అంటూ మరికొందరు అసలు ఈ సినిమా ఎలా ఆడుతుందో చూస్తాం? అంటూ ఇంకొందరు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌ రకరకాలుగా ఫార్మెట్‌లో సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారు. ఇలా చేస్తుంది ఎవరు? అనేది మాకు తెలియడంలేదని చిత్ర నిర్మాతలు సోమవారంనాడు వాపోయారు. మేం సోషల్‌ మీడియా మాటలు విని థియేటర్‌కు వెళ్ళి మరలా చూశాం. ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారు. ఊహించని దానికంటే రెండరోజుల్లోనే 2కోట్లకుపైగా వసూలు చేసింది. అంటూ సుమంత్‌ ప్రభాస్‌ చెబుతున్నాడు. కానీ మా సినిమాను థియేటర్లలో చూడనివ్వమని రూమర్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. అంటూ మరోవైపు ఆవేదన చెందుతున్నారు. 
 
మరి సోషల్‌మీడియాలో నెగెటివ్‌గా స్పందిస్తే, అక్కడే రెస్పాన్స్‌ ఇవ్వాల్సిందిపోయి ఏకంగా మీడియాను తెగ వాడేసుకునేందుకు నిర్మాతలు చూశారు. ఇదో న్యూసెన్స్‌ లా వుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే సోషల్‌మీడియాలోనూ నెగెటివ్‌ కామెంట్లు వచ్చేశాయి. మీడియా ద్వారా సానుభూతి పొందాలనుకోవడం మరింత దౌర్భాగ్యం అంటూ నెటిజన్లు స్పందించడం విశేషం.