మంగళవారం, 27 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 ఆగస్టు 2021 (08:46 IST)

మీరాభాయ్ చానుకు రజతం.. నమ్మడం లేదంటున్న మాధవన్

టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో మిజోరాం క్రీడాకారిణి మీరాభాయ్ చాను 49 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించింది. తద్వారా భారత్‌కు తొలి రజత పతకాన్ని అందించింది. ఈ క్ర‌మంలో ఆమకు అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆమె సాధించిన ఘ‌న‌త‌కు ప్ర‌శంస‌ల వ‌ర్షంతో పాటు రివార్డ్స్ కూడా ద‌క్కాయి. 
 
మిజోరాం ప్రభుత్వం ఆమెకు స్పోర్ట్స్ కోటాలో అడిషనల్ సూపరంటెండెంట్ అఫ్ పోలీస్‌గా పదవి కూడా ఇచ్చింది. రెండు కోట్ల రూపాయ‌లు న‌గ‌దు కూడా బ‌హుమ‌తిగా ద‌క్కించుకుంది. 
 
అయితే తాజాగా మీరాభాయ్ నేలపై కూర్చొని భోజనం చేస్తున్న ఫోటో కూడా ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోని చూసిన నెటిజ‌న్స్.. ఏ మాత్రం అహం లేకుండా సింపుల్‌గా ఉంటున్న మీరాభాయ్, చాలా గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
 
ఈ ఫొటోపై తాజాగా న‌టుడు మాధ‌వన్ స్పందించాడు. 'అసలు ఇది నిజమేనా.. నేను నమ్మడం లేదు' అంటూ ఆయన పేర్కొన్నారు. ఉపాధి లేక‌పోయిన మ‌హిళ‌లు ధృడ సంక‌ల్పంతో ముందుకు వెళ్లాలి అనే కోణంలో మాధ‌వ‌న్ స్పందించాడు అంటూ అయ‌న అభిమానులు చెబుతున్నారు.