ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 31 జులై 2021 (08:46 IST)

టోక్యో ఒలింపిక్స్ : డిస్కస్ త్రోలో క్వాలిఫై అయిన కమల్ ప్రీత్ కౌర్

టోక్యో ఒలింపిక్ క్రీడా పోటీల్లో భారత డిస్క‌స్ త్రోయ‌ర్ క‌మ‌ల్‌ప్రీత్ కౌర్ ఫైన‌ల్ చేరింది. శ‌నివారం ఉద‌యం జ‌రిగిన క్వాలిఫికేష‌న్‌లో ఆమె 64 మీట‌ర్ల దూరం విసిరి.. ఫైన‌ల్లో స్థానాన్ని ఖాయం చేసుకుంది. 
 
అంతేకాదు మొత్తం గ్రూప్ ఎ, గ్రూప్ బి క్వాలిఫికేష‌న్ల‌లో క‌లిపి క‌మ‌ల్‌ప్రీత్ విసిరిందే రెండో అత్య‌ధిక దూరం కావ‌డం విశేషం. తొలి ప్ర‌యత్నంలో 60.59 మీట‌ర్ల దూరమే విసిరిన ఆమె.. రెండో ప్ర‌య‌త్నంలో ఏకంగా 63.97 మీట‌ర్లు, మూడో ప్ర‌య‌త్నంలో 64 మీట‌ర్ల మార్క్ అందుకుంది. 
 
ఇక ఈ ఈవెంట్‌లోనే గ్రూప్ ఎలో పార్టిసిపేట్ చేసిన మ‌రో ఇండియ‌న్ డిస్క‌స్ త్రోయ‌ర్ సీమా పూనియా 60.57 మీట‌ర్ల దూరమే విసిరి ఫైన‌ల్‌కు క్వాలిఫై కాలేక‌పోయింది. మొత్తంగా ఆమె 16వ స్థానంలో నిలిచింది. దీంతో కమల్ ప్రీత్ పతకంపై ఆశలు రేకెత్తించేలావుంది.