ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 జులై 2021 (15:20 IST)

ఆశలు రేపుతున్న పీవీ సింధు - సెమీస్‌లోకి ప్రవేశం

టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు అమ్మాయి పీవీ సింధు పతక ఆశలు కలిగిస్తోంది. ఇప్పటివరకు ఆమె ప్రయాణం సాఫీగా సాగడంతో శుక్రవారం సెమీస్‌లోకి అడుగుపెట్టింది. 
 
శుక్రవారం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌‌లోకి దూసుకెళ్లింది. ఈ క్వార్టర్ ఫైనల్ పోరులో సింధు 21-13, 22-20తో వరుసగా రెండు గేమ్‌లు గెలిచి యమగూచిని మట్టికరిపించింది.
 
తొలి గేమ్‌లో యమగూచిని బలమైన స్మాష్‌లు, తెలివైన ప్లేసింగ్‌లతో బెంబేలెత్తించిన సింధుకు రెండో గేమ్‌లో కాస్తంత ప్రతిఘటన ఎదురైంది. అయితే, అద్భుత ఆటతీరుతో పుంజుకున్న సింధు తన ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా గేమ్‌ను, తద్వారా మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఇక సెమీఫైనల్లో గెలిస్తే సింధుకు పతకం ఖాయమని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు.