గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 29 జులై 2021 (16:58 IST)

ప్రీక్వార్టర్‌లో భారత బాక్సర్ మేరీ కోమ్ బోల్తా

టోక్యో ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో పతకం సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలన్న దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఫ్లై వెయిట్ (48-51 కిలోలు) కేటగిరిలో గురువారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో మేరీ కోమ్ ఓటమిపాలైంది. 
 
కొలంబియాకు చెందిన ఇంగ్రిట్ వాలెన్సియా చేతిలో 2-3 తేడాతో పరాజయం చవిచూసింది. ఆరు పర్యాయాలు వరల్డ్ చాంపియన్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీ కోమ్ ఈ బౌట్‌లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డినా ఫలితం లేకపోయింది. 
 
ప్రత్యర్థికి ధీటుగానే పంచ్‌లు కురిపించినా, పలు రౌండ్లలో కొలంబియా బాక్సర్ ఇంగ్రిట్ వాలెన్సియా ఆధిపత్యం సాగించింది. ఫలితంగా ప్రీ క్వార్టర్ ఫైనల్ పోటీలో మెరీకోమ్ ఓటమిపాలై భారత్‌కు పతక ఆశలను చెరిపేసింది.