ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 జులై 2021 (12:05 IST)

ఒలింపిక్స్‌లో దూసుకుపోతున్న పీవీ సింధు..

భారత ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఒలింపిక్స్‌లో దూసుకుపోతోంది. గ్రూప్‌ - జేలో జరిగిన రెండో పోరులో ఆమె విజయం సాధించింది. హాంకాంగ్‌కు చెందిన చెంగ్‌ ఎంగన్‌ యిని 2-0 తేడాతో ఓడించింది. తొలి గేమ్‌ను 21-9తో కైవసం చేసుకోగా.. రెండో గేమ్‌లో ఆమె మరింత శ్రమించాల్సి వచ్చింది. ప్రత్యర్థితో పోటాపోటీగా తలపడి 21-6తో గేమ్‌తోపాట మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
 
అలాగే పురుషుల వ్యక్తిగత ఆర్చరీ పోటీల్లో తరుణ్‌రాయ్ వెనుదిరిగాడు. ఇజ్రాయెల్‌కు చెందిన షానీ ఇటే చేతిలో 6-5 తేడాతో ఓటమిపాలయ్యారు. రారు కేవలం ఒకే ఒక్క పాయింట్‌ తేడాతో ఓడిపోవడం గమనార్హం. నాలుగో సెట్లో 3-5తో వెనకబడిన అతడు ఐదోసెట్లో 5-5తో స్కోరు సమం చేశాడు. అయితే, షూట్‌లో షానీ 10కి గురిపెట్టగా తరుణ్‌దీప్‌ 9కి పరిమితమయ్యాడు. అంతకుముందు ఉక్రెయిన్‌ ఆర్చర్‌పై 6-4 తేడాతో రారు విజయం సాధించడం గమనార్హం.