సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 జులై 2021 (10:31 IST)

మరోసారి అదరగొట్టిన భారత హాకీ జట్టు.. స్పెయిన్‌పై ఘన విజయం

ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు మరోసారి అదరగొట్టింది. పూల్‌-ఏలో జరిగిన మూడో మ్యాచ్‌లో స్పెయిన్‌పై ఘన విజయం సాధించింది.3-0 గోల్స్‌తో స్పెయిన్‌పై గెలిచిన టీమిండియా పూల్‌-ఏలో రెండో స్థానానికి ఎగబాకింది. 
 
మ్యాచ్ ఆరంభం నుంచి స్పెయిన్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది భారత జట్టు. తొలి క్వార్టర్‌లోనే రెండు గోల్స్‌ చేసి స్పెయిన్‌కు షాకిచ్చింది. ఆ తర్వాత స్పెయిన్‌ను ఒక్క గోల్‌ కూడా చేయకుండా కట్టడి చేసింది. 
 
మూడో క్వార్టర్‌ వరకు 2-0తో ముందున్న టీమిండియా నాలుగో క్వార్టర్‌లో మరో గోల్ సాధించింది. రెండు గోల్స్ చేసిన రూపిందర్‌పాల్‌ భారత జట్టు విజయానికి బాటలు వేశాడు. ఇక తాజా విజయంతో భారత హాకీ జట్టు ఫైనల్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.