శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 జులై 2021 (11:39 IST)

పాస్ పోర్ట్ కోసం ఎక్కడికీ వెళ్లక్కర్లేదు.. పోస్టాఫీస్‌కు వెళ్తే చాలు

ఇకపై పాస్‌పోర్ట్ తీసుకోవడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. దగ్గరిలోని పోస్టాఫీస్‌కు వెళ్లి పాస్‌పోర్ట్ తీసుకోవచ్చు. దీంతో కొత్తగా పాస్‌పోర్ట్ తీసుకోవాలని భావించే వారికి ఊరట కలుగనుంది. ఇండియా పోస్ట్ తాజాగా ఈ విషయాన్ని తెలియజేసింది. ట్విట్టర్ వేదికగా ఈ అంశాన్ని ప్రకటించింది. 
 
పాస్‌పోర్ట్ రిజిస్ట్రేషన్, పాస్‌పోర్ట్ అప్లికేషన్ వంటి సర్వీసులు దేశవ్యాప్తంగా ఉన్న పలు పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంటాయి. పోస్టాఫీస్ కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి పాస్‌పోర్ట్ సేవలు పొందొచ్చు. పాస్‌పోర్ట్ అనేది చాలా కీలకమైన డాక్యుమెంట్లలో ఒకటని చెప్పుకోవచ్చు. 
 
ఇది ఐడెంటిటీ ప్రూఫ్‌గానే కాకుండా ఇంటర్నేషనల్ ట్రావెల్‌కు కచ్చితంగా కావాలి. విదేశాలకు వెళ్లిన వారు పాస్‌పోర్ట్ కలిగి ఉంటే.. అక్కడ ఇండియన్ సిటిజన్‌గా గుర్తింపు లభిస్తుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బర్త్‌ సర్టిఫికెట్, బ్యాంక్ అకౌంట్ వంటి డాక్యుమెంట్లు కావాలి. passportindia.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో కూడా పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసుకోవచ్చు.