శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 జులై 2021 (14:51 IST)

ఒలింపిక్స్ గ్రామంలో కరోనా కలకలం.. 16మంది క్రీడాకారులకు పాజిటివ్

టోక్యో ఒలింపిక్స్ 2021లో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి కలకలం రేపింది. ఒలింపిక్స్ గ్రామంలో సోమవారం మరో 16 మంది క్రీడాకారులకు వైరస్ సోకింది. కరోనా సోకిన వారిలో ముగ్గురు విదేశీ అథ్లెట్లు ఉన్నారని ఒలింపిక్స్ నిర్వాహకులు వెల్లడించారు. 
 
కరోనా సోకిన అథ్లెట్లను టోక్యో క్రీడా విలేజ్ నుంచి బయటకు పంపంచి క్వారంటైన్ చేశారు. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారట. నిర్వాహకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. రోజురోజుకు కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ఒలింపిక్స్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.
 
టోక్యో ఒలింపిక్స్ 2021లో కరోనా వైరస్ పాజిటివ్ రోగుల సంఖ్య సోమవారం నాటికి 148కి చేరింది. 13 ఆటలకు సంబంధించిన 8 మంది క్రీడాధికారులు కూడా కరోనా బారిన పడ్డారు. టోక్యో ఒలింపిక్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఓ అథ్లెట్లుకు కరోనా సోకింది. 
 
డచ్ రోవర్ ఫిన్ ఫ్లోరిజ్న్‌కు కరోనా పాజిటివ్ రావడంతో అతన్ని క్వారంటైన్‌కు తరలించారు. ఒకవైపు గేమ్స్ సాగుతుండగా, మరోవైపు క్రీడాగ్రామంలో కరోనా కేసులు బయటపడుతున్నాయి. దీంతో నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు.