కరోనా కాటుకు 2,903మంది రైల్వే ఉద్యోగులు బలి
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో లక్షల్లో ప్రాణాలు పోయాయి. మహమ్మారి ప్రభావం ఆరంభమైనప్పటికే లాక్ డౌన్ మొదలుపెట్టినా.. కొద్దిపాటి విరామం తర్వాత రైల్వే సర్వీసులు రీ స్టార్ట్ చేయడంతో రైల్వే ఉద్యోగులు వైరస్ బారినపడ్డారు.
చాలా మంది కోలుకున్నప్పటికీ.. 2,903మంది ప్రాణాలు కోల్పోయారట. ఈ విషయాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో వెల్లడించారు. ఆ ఉద్యోగులకు చెందాల్సిన బకాయిలను 2,780 మంది బాధిత కుటుంబ సభ్యులకు అందజేసినట్లు వివరించారు.
అంతేకాకుండా.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన రైల్వే ఉద్యోగులపై ఆధారపడిన కుటుంబ సభ్యులను ఆదుకునే కారుణ్య నియామకాలు చేపట్టే విధానం రైల్వేలో ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే వెయ్యి 732 బాధిత కుటుంబాలకు కొలువులు కల్పించామని ఆమె అన్నారు.
కరోనా వ్యాక్సిన్ పంపిణీ రైల్వే శాఖలో కూడా శరవేగంగా కొనసాగుతోందని రైల్వే డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. 8లక్షల 63వేల 868 మంది రైల్వే ఉద్యోగులకు తొలిడోసు అందించగా.. 2లక్షల 34వేల 184 మందికి పూర్తి వ్యాక్సినేషన్ అందుకున్నారని పేర్కొంది.