శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (18:03 IST)

ఇది మేరేజ్ రింగ్ కాదు- నేనే కొనుక్కున్నా - లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi
Lavanya Tripathi
ఇటీవ‌లే లావణ్య త్రిపాఠి పెండ్లి విష‌యంలో చాలా ఆస‌క్తిక‌ర వార్త‌లు వ‌చ్చాయి. రెండు రోజుల్లో పెండ్లి అయిపోతుందంటూ వార్త‌లు వినిపించాయి. అయితే దీనిపై లావణ్య త్రిపాఠి ఇలా స్పందించింది. `నిజంగా నా పెళ్లి గురించి అంత జ‌రిగిందా.. నాకు తెలీదే.  ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచన లేదు. నా చేతికి ఉన్న రింగ్ ఎవరూ తొడగలేదని, నేనే కొనుక్కున్నానని` చూపించింది.
 
ఆమె న‌టిస్తున్న తాజా సినిమా హ్యాపీ బర్త్ డే. ఇప్ప‌టికీ ఆమె కెరీర్ ప‌దేళ్ళు పూర్తిచేసుకుంది. ఈ సినిమా విడుద‌ల‌కావ‌డం చాలా ఆనందంగా వుంది. తొలి సినిమా అందాల రాక్ష‌సికి రాజ‌మౌళి స‌మ‌ర్ప‌కులు. ఇప్పుడు ఈ సినిమా ప్ర‌మోష‌న్‌కూ ఆయ‌న వ‌చ్చాడు. ప‌దేళ్ళ త‌ర్వాత ఆయ‌న రావ‌డం నాకూ థ్రిల్‌గా అనిపించింది. అని చెప్పింది.