శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 జనవరి 2023 (17:44 IST)

98 సెకన్లలో ఆర్ఆర్ఆర్ టిక్కెట్లు సోల్డ్ అవుట్.. 'ఆస్కార్‌'కు ఎన్టీఆర్‌ పేరు..?

rrrforoscars
ఎస్ఎస్ రాజమౌళి RRR సినిమా ప్రపంచ దేశాలలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఆస్కార్ ప్రచారంతో పాశ్చాత్య ప్రేక్షకులను నోరు మూయించింది ఆర్ఆర్ఆర్. లాస్ ఏంజెల్స్‌లోని టీసీఎల్ చైనీస్ థియేటర్‌లో జనవరి 9న బియాండ్ ఫెస్ట్ 'EncoRRRe'లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.  
 
తాజాగా 932 మంది కూర్చునే ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఏ IMAX థియేటర్‌లో కేవలం 98 సెకన్లలో ఆర్ఆర్ఆర్ కు చెందిన అన్ని టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ వార్తను బియాండ్ ఫెస్ట్ అధికారిక ఖాతా ద్వారా ట్విట్టర్‌లో ప్రకటించారు. 
 
భారతీయ చిత్రానికి ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత క్రేజ్ లభించలేదు. RRR చిత్రం IMAXలోని చైనీస్ థియేటర్‌లలో 98 సెకన్లలో టికెట్లు అమ్ముడైందని చైనీస్ థియేటర్ అధికారికంగా ప్రకటించింది. టిక్కెట్‌లను కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలంటూ పేర్కొంది. 
 
మరోవైపు హాలీవుడ్ మ్యాగజైన్ 'వెరైటీ' ఆస్కార్ పట్ల ప్రత్యేకమైన కథనాన్ని ప్రచురించింది. ఇందులో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ నటుడి జాబితాలో ఎన్టీఆర్‌ పేరు 'ఆస్కార్‌'కు నామినేట్‌ అయ్యే అవకాశం ఉందని ఈ మ్యాగజైన్‌ పేర్కొంది. విల్‌ స్మిత్‌, హ్యూ జాక్‌మన్ వంటి హాలీవుడ్‌ స్టార్స్‌ పేర్లతో ఉన్న ఈ జాబితాలో ఎన్టీఆర్‌ చోటు దక్కడంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.