1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 13 అక్టోబరు 2023 (08:58 IST)

గాయత్రి భరద్వాజ్ తో రొమాంటిక్ సాంగ్ వేసుకున్న టైగర్ నాగేశ్వరరావు

Ravi Teja, Gayatri Bharadwaj
Ravi Teja, Gayatri Bharadwaj
నిండు వెన్నెల చలి మంట అందుకు అనుగుణంగా డాన్స్ .. ఇలా బ్యూటీఫుల్ రొమాంటిక్ మెలోడీగా పాటని కంపోజ్ చేశారు జీవి ప్రకాష్. భాస్కరభట్ల రవికుమార్ అందించిన సాహిత్యం.. హీరోయిన్ మనసులోని ప్రేమని చాలా అందంగా ఆవిష్కరించింది. సింధూరి మెస్మరైజ్ వాయిస్ తో ఆకట్టుకున్నారు. ఈ పాటలో రవితేజ, గాయత్రి భరద్వాజ్ ల కెమిస్ట్రీ వండర్ ఫుల్ గా వుంది. విజువల్స్ ఎక్స్ ట్రార్డినరీ గా వున్నాయి.  
 
మాస్ మహారాజా రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు కోసం చిత్రించిన ఈ పాట విడుదలైంది.  వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2ని అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు.  ఇటివలే విడుదలై ట్రైలర్‌ కు నేషనల్ వైడ్ గా టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది.
 
జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని రెండు పాటలు చార్ట్ బస్టర్స్ హిట్స్ గా అలరిస్తున్నాయి. ఈ రోజు మేకర్స్ థర్డ్ సింగిల్ ‘ఇచ్చేసుకుంటాలే’ పాటని విడుదల చేశారు.  
 
నూపుర్ సనన్ మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి, ప్రొడక్షన్‌ డిజైనర్‌ అవినాష్‌ కొల్లా. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.
టైగర్ నాగేశ్వరరావు దసరా సందర్భంగా అక్టోబర్ 20న అన్ని దక్షిణాది భాషలు, హిందీలో విడుదల కానుంది.
తారాగణం: రవితేజ, నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు