గురువారం, 25 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2023 (16:37 IST)

నితిన్ హీరోగా ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌

Nitin look
Nitin look
నితిన్, బ్యూటీ డాల్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’.  రైట‌ర్ - డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 8న ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’ సినిమాను భారీ ఎత్తున్న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
 
మ్యూజికల్ జీనియస్ హారిస్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది వరకే విడులైన ‘డేంజర్ పిల్లా..’ సాంగ్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే నితిన్ లుక్స్‌కి కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.  నితిన్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి పాత్ర‌లో ఆకట్టుకోబోతున్నార‌ని, క‌చ్చితంగా ఆయ‌న అభిమానుల‌నే కాదు, ప్రేక్ష‌కుల‌ను కూడా నితిన్ త‌న బ్రిలియంట్ పెర్ఫామెన్స్‌తో మెప్పించ‌నున్నారు.  క్యారెక్ట‌ర్ బేస్డ్ స్క్రిప్ట్‌తో.. కిక్ త‌ర్వాత ఆ రేంజ్ జోన్‌లో తెర‌కెక్కుతోంది. ఆడియెన్స్‌కి రోల‌ర్ కోస్ట‌ర్‌లాంటి ఎక్స్‌పీరియెన్స్‌నిస్తూ న‌వ్విస్తూనే స‌ర్‌ప్రైజ్‌ల‌తో సినిమా మెప్పించ‌నుందని డైరెక్టర్ వక్కంతం వంశీ అన్నారు.
 
 శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ & ఎంట‌ర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై  సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.