మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 జులై 2022 (16:17 IST)

సినిమా ధరలపై స్పష్టతనిచ్చిన నిర్మాత దిల్ రాజు...

dil raju
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా ధరలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పష్టతనిచ్చారు. తాను నిర్మించిన 'థ్యాంక్‌ యూ' సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. "థ్యాంక్‌ యూ" సినిమా టికెట్‌ ధరలపై ఇటీవల నేనొకటి చెప్తే మీడియాలో మరో రకంగా రాశారన్నారు. ఈ విషయంలో ఎక్కడ తప్పు జరిగిందో అర్థం కావడం లేదన్నారు. 
 
ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారమే మా చిత్రం 'ఎఫ్‌ 3' టికెట్‌ ధరలను అందుబాటులో ఉంచాం. ఆ తర్వాత విడుదలైన 'విక్రమ్‌', 'మేజర్‌' చిత్ర బృందాలూ తగ్గించాయి. 'థ్యాంక్‌ యూ' కూడా ఈ జాబితాలోకే వస్తుంది. హైదరాబాద్‌, వరంగల్‌లాంటి నగరాల్లో రూ.150+ జీఎస్టీ (సింగిల్ స్క్రీన్స్‌), రూ.200+ జీఎస్టీ (మల్టీప్లెక్స్‌)గా ఈ సినిమా టికెట్‌ ధరలుంటాయి. స్టార్‌ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్‌ చిత్రాలు మినహా మిగిలిన అన్ని సినిమాలకు ఇకపై ఇవే ధరలు వర్తిస్తాయని దిల్ రాజు తెలిపారు.