శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (13:21 IST)

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం : దర్శకుడు ఇరుగు గిరిధర్ మృతి

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. దర్శకుడు ఇరుగు గిరిధర్ (64) తుది శ్వాస విడిచారు. గత ఆరు నెలల క్రితం ఒకసారి జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన దర్శకుడు గిరిధర్ అప్పటినుంచి మంచానికి పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే అతని ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో ఆదివారం తిరుపతిలోని తన సొంత నివాసంలో కన్నుమూశారు.
 
ప్రమాదం కారణంగా మృతి చెందిన నటుడు దర్శకుడు గిరిధర్ మృతి పట్ల పలువురు సినీ తారలు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక తెలుగువాడిగా నటనపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన గిరిధర్ ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా, పని చేశారు. అదే విధంగా పలు సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
 
వరుడు, అన్నవరం, గుడుంబా శంకర్ వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టరుగా పని చేసిన ఆయన... ఆ తర్వాత చంద్రమోహన్, ఆమని, వినోద్ కుమార్, ఇంద్రజ ప్రధాన పాత్రలో నటించిన "శుభ ముహూర్తం" అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ విధంగా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి దర్శకుడిగా మారి తొలి సినిమాను తెరకెక్కించడంతో మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. 
 
ఈ క్రమంలోనే గిరిధర్ ఎక్స్ ప్రెస్ రాజా, 110 పర్సెట్ లవ్, శ్రీమంతుడు, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి చిత్రాలలో పలు కీలక పాత్రలో నటించి మంచి నటుడిగా గుర్తింపును సంపాదించుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో వివిధ రంగాలలో పనిచేస్తూ కెరియర్లో ముందుకు వెళ్తున్న సమయంలో ఒక రోడ్డు ప్రమాదం అతని జీవితాన్ని కబళించి మృత్యు ఒడిలోకి చేరుకున్నారు.