సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (20:55 IST)

రష్మికకు రింగ్ పంపిన టాలీవుడ్ హీరో ఎవరు..?

కిర్రిక్ పార్టీ ద్వారా హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన రష్మిక.. ఈ మూవీ హీరో రక్షిత్ శెట్టితో ప్రేమలో పడింది. వారిద్దరికి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. అయితే కొన్ని కారణాల వలన ఆ ఎంగేజ్‌మెంట్‌ను ఇద్దరు క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తరువాత ఎవరి కెరీర్‌లో వారు బిజీ అయ్యారు. కానీ ఇప్పటికీ మంచి స్నేహితులుగా ఉన్నారు. ఈ క్రమంలో ఆ మధ్యన రక్షిత్, రష్మికకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పారు.
 
హీరోయిన్‌గా కన్నడలో కెరీర్‌ను ప్రారంభించిన రష్మిక మందన్న.. ఇటు తెలుగులోకి వచ్చింది. ఇక్కడ వరుస విజయాలను సొంతం చేసుకొని టాప్ హీరోయిన్ స్టేటస్‌ను సంపాదించుకొని అటు తమిళ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. తమిళ్‌లో కార్తీ సరసన రష్మిక నటించిన సుల్తాన్ ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే విజయ్ తదుపరి సినిమాలో పూజా హెగ్డేతో పాటు రష్మికను తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది ఈ బ్యూటీ. సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తోన్న మిషన్ మజ్నులో హీరోయిన్‌గా నటిస్తోన్న రష్మిక.. అక్కడ మరో మూవీని ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.
 
ఇక ఇప్పుడు రష్మిక టాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరోతో క్లోజ్‌గా ఉన్నట్లు ఎప్పటినుంచో టాక్ నడుస్తోంది. ఈ క్రమంలో అతడే రష్మికకు ఈ రింగ్ పంపి ఉంటాడన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది రష్మిక. ఆ రింగ్‌ను పెట్టుకొని ఫొటో తీసుకున్న రష్మిక.. నువ్వు ఎవరో నాకు తెలిసిపోయింది. ఇది నాకు ఎవరో పంపారో వాళ్లకు చెబుతున్నా మీ గిఫ్ట్ నాకు అందింది. 
 
మీ సీక్రెట్ మెసేజ్‌లను నేను చదివా. ఈ రింగ్ నాకు కరెక్ట్‌గా సరిపోయింది అని కామెంట్ పెట్టారు. మరో ఫొటోలో ఆ రింగ్‌ను పెట్టుకొని హ్యాపీ హోలీ అని పోస్ట్ చేశారు. అయితే ఈ రింగ్ పంపింది ఎవరు.. ఏమని సీక్రెట్ మెసేజ్ పంపారన్న చర్చ ఇప్పుడు ఆమె అభిమానుల్లో జరుగుతోంది. మరి మొత్తానికి త్వరలోనైనా రష్మిక తనకు రింగ్ పంపిన వ్యక్తి పేరును బయట పెడుతుందో లేదో తెలియాలంటే వేచి చూడాలి.