శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 మార్చి 2021 (13:54 IST)

అల్లు అర్జున్ "గంగోత్రి"కి 18 వసంతాలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తొలి చిత్రం గంగోత్రి. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కె.రాఘవేంద్ర రావు, సి. అశ్వనీదత్, అల్లు అరవింద్‌లు కలిసి నిర్మించారు. ఆర్తీ అగర్వాల్ చెల్లెలైన అదితి అగర్వాల్ ఈ చిత్రం ద్వారా తెలుగు సినీరంగానికి పరిచయం అయింది. ఇది రాఘవేంద్ర రావుకు వందో చిత్రం కూడా. ఈ చిత్రం విడుదలై నేటికి 18 ఏళ్లు. 
 
హీరోగా త‌న తొలి సినిమా విడుద‌లై 18 ఏళ్లు గ‌డుస్తున్న సంద‌ర్భంగా అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. "నా తొలి సినిమా విడుద‌లై 18 ఏళ్లు అవుతుంది. నా 18 ఏళ్ల సినీ ప్ర‌యాణంలో తోడుగా నిలిచిన ప్ర‌తి ఒక్క‌రికీ నేను మ‌న స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను. ఇన్నేళ్లుగా మీరు నాకు తోడుగా నిలుస్తుండ‌డం నా అదృష్టం" అని బ‌న్నీ ట్వీట్ చేశాడు. ఆయ‌న‌కు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.
 
ఈ సినిమాకిగాను అల్లు అర్జున్‌కి తన చేతుల మీదుగా వంద రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చారట రాఘవేంద్రరావు. ఈ విష‌యాన్ని ఆ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో రాఘ‌వేంద్ర‌రావు వెల్లడించారు కూడా.