బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 15 మార్చి 2021 (22:54 IST)

బుట్టబొమ్మను దున్నేసిన సారంగ దరియా.. 50 మిలియన్ వ్యూస్‌తో అదుర్స్ (video)

సారంగ దరియా పాట ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 'సారంగ దరియా' పాటకు పవన్ సీహెచ్ సంగీతం అందించగా.. మంగ్లీ పాటను ఆలపించింది. శేఖర్ మాస్టర్ అందించిన కొరియోగ్రఫీ అందించగా.. సుద్దాల అశోక్ తేజ సాహిత్యాన్ని సేకరించారు. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
 
ఏప్రిల్ 16న 'లవ్ స్టోరి' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు. విడుదలకు ముందే ఈ లవ్ స్టోరీ భారీ సంచలనాలు క్రియేట్ చేస్తోంది. 
 
తాజాగా ఈ పాట భారీ రికార్డ్ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. 2020లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన మూవీ అల వైకుంఠపురంలో. గత ఏడాది విడుదల అయిన ఈ చిత్రంలో సాంగ్స్ ఆల్ టైమ్ హిట్స్‌గా నిలిచాయి. థమన్ అందించిన బాణీలు అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించాయి. ముఖ్యంగా సామజవరగమణ, బుట్టబొమ్మ, రాములో రాములా, సాంగ్స్ ఐతే సోషల్ మీడియాలో మోతమోగాయి. యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశాయి.
 
అయితే, తాజాగా ఇప్పుడు బుట్టబొమ్మ రికార్డులకు బీటలు పడ్డాయి. అత్యధిక వ్యూస్ పొందిన 'బుట్ట బొమ్మ'పాటను తెలంగాణ జానపద గీతం 'సారంగ దరియా'వెనక్కి నెట్టింది. యూట్యూబ్‌లో అత్యంత వేగంగా 50 మిలియన్ వ్యూస్ సాధించిన తొలి తెలుగు పాటగా నిలిచింది. దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ప్రేమ కావ్యం 'లవ్ స్టోరి'. ఫిబ్రవరి 28న సమంత చేతుల మీదుగా రిలీజ్ చేసిన 'సారంగ దరియా' సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
 
ఈ పాట కేవలం 14 రోజుల్లో 50 మిలియన్ వ్యూస్ మార్క్‌ను చేరుకుంది.'బుట్ట బొమ్మ' పాటకు 18 రోజులు 50 మిలియన్ వ్యూస్ రాగా, 'రాములో రాములా' పాటకు 27 రోజుల్లో వచ్చాయి. 'సారంగ దరియా'తరవాతే కంటే 'బుట్ట బొమ్మ','రాములో రాములా'ఉన్నాయి. ఇకపోతే గతంలో ధనుష్‌తో సాయి పల్లవి హీరోహీరోయిన్లగా చేసిన 'రౌడీ బేబీ' సాంగ్ ఒక్కటే 8 రోజుల్లో 50 మిలియన్ వ్యూస్‌కు వచ్చి 'సారంగదరియా'కంటే ముందుంది.