నాతోపాటు చుట్టూ వున్నవారూ పెరగాలిః అల్లు అర్జున్
చావుకబురు చల్లగా ఫంక్షన్‌లో వ్యాఖ్య
Allu arjun, Chavukaburu team
కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన సినిమా `చావుకబురు చల్లగా`. బన్నీవాసు నిర్మాత. గీతా ఆర్ట్స్ పతాకంపై రూపొందింది. ఈనెల 11న విడుదల కాబోతుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఈ సినిమా కథ గురించి బన్నీవాసు గురించి చెప్పాలి. ఎంత ఇష్టమయితే నా పేరును ఆయన పేరుముందు పెట్టుకుంటాడు. నేను ఇలా వున్నానంటే కారణం నాన్నగారు. ఆయనకంటే ఎక్కువ వాసు. మాది 18 ఏళ్ళ జర్నీ. గంగోత్రి నుంచి నాతో ట్రావెల్ చేస్తున్నాడు. 100%లవ్ వంటి మంచి సినిమాలు చేశాడు. నేను ఈ సినిమా కథ విన్నాను. తనకు బాగా నచ్చింది. కథను నవదీప్ విన్నాడు. తను తీసుకుందామనుకున్నాడు. కానీ నచ్చిదంటే నాకు ఇచ్చేశాడని వాసు చెప్పాడు. అది మామూలు విషయం కాదు. ఇక శరత్ మా ఫ్యామిలీ మెంబర్. ఇలా చాలామంది వున్నారు. నా చుట్టుపక్కల వారూ పెరగాలనేది నా పిచ్చి కోరిక.
ఈరోజే సినిమా చూశా. చాలా బాగుంది. అందరికీ నచ్చుతుంది. దర్శకుడు కౌశిక్ 26 ఏళ్ళవాడు. ఎంతో పరిణితి చెందేలా ఆలోచించాడు. నాకు ఆ వయస్సులో అంత మెచ్చూరిటీ రాలేదని సిగ్గేసింది. అలాగే కార్తికేయ వయస్సు 27. ఆర్ఎక్స్-100 సినిమా చూశాను. బాగా చేశాడు. అప్పటికీ ఇప్పటికీ చాలా పరిణతి కనిపించింది. లావణ్య మా గీతా ఆర్ట్స్‌లో మూడవ సినిమా చేసింది. ఇక ఆమనిగారి సినిమాలు చూసి పెరిగాను. ఇందులో మంచి పాత్ర పోషించారు. సుకుమార్‌గారు కూడా ఆమె నటన మెచ్చుకున్నారు. అనసూయ స్పెషల్ సాంగ్ చేసింది. కోవిడ్‌లో కూడా జనాలు వస్తారా రారా అనే అనుమానం వుండేది. క్రాక్ సినిమా నుంచి మాకు ధైర్యం వచ్చింది. అది మీరే ఇచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు.