సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (16:30 IST)

అన‌సూయ `పైన ప‌టారం లోన లొటారం` ఐట‌మ్ సాంగ్ ప్రోమోకు అనూహ్య స్పంద‌న‌

Item song Anasuya
మార్చి1న‌ 4:05PMకు అల్లు అరవింద్,‌ జీఏ2 పిక్చ‌ర్స్, బ‌న్నీవాసు, కార్తికేయ "చావు క‌బురు చ‌ల్ల‌గా " చిత్రం నుంచి మాస్ ఐటెమ్ సాంగ్ నెంబ‌ర్ `పైన ప‌టారం` ‌విడుద‌ల‌కు సిద్ద‌మైంది. అన‌సూయ ఐటెంసాంగ్‌లో రెచ్చిపోయింది. కార్తికేయ‌తో క‌లిసి డాన్స్ చేసింది. దీనికి సంబంధించిన ప్రోమోను శ‌నివారం విడుద‌ల జేస్తే అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది.

లావ‌ణ్య త్రిపాఠి నాయిక‌. కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి ద‌ర్శ‌కుడు. ఇప్పటికే విడుదలైన టైటిల్, హీరో కార్తికేయ 'బ‌స్తి బాల‌రాజు' ఫ‌స్ట్ లుక్, ఇంట్రో కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి, మైనేమ్ ఈజ్ రాజు, క‌దిలే కాలాన్ని అడిగా అనే పాటల‌‌కు కూడా అనూహ్య స్పంద‌న ల‌భించింది. ముఖ్యంగా కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ చూస్తే మ‌ళ్లీ చూడాల‌నిపించేలా ఉందంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి.

Kartikeya, Anasuya
ఈ నేప‌థ్యంలో చావు క‌బ‌రు చ‌ల్ల‌గా ఆడియో నుంచి అన‌సూయ చిందేసిన‌ ఓ మాస్ ఐటెమ్ సాంగ్ ని మార్చి 1న సాయంత్రం 4 గంట‌ల 5 నిమ‌షాల‌కి విడుద‌ల చేస్తున్న‌ట్లుగా చిత్ర యూనిట్‌ ప్ర‌క‌టిస్తూ హీరో కార్తీకేయ‌, అన‌సూయ క‌లిసి చిందేసిన స్టెప్పుల‌తో ఓ ప్రోమోని విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈ ప్రోమో అన్ని వ‌ర్గాలు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటూ సోష‌ల్ మీడియా లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Anasuya song-1
ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి మాట్లాడుతూ, ఇప్ప‌టికే చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రం నుంచి విడుద‌ల చేసిన ప‌బ్లిసిటీ కంటెంట్ కు అనూహ్య స్పంద‌న అంద‌చేసిన మాస్ అభిమానులు అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే రాబోతున్నపైన ప‌టారం లోన లొటారం పాట‌ను సిద్ధం చేసినట్లుగా తెలిపారు. ఈ చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీవాసు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుద‌ల చేస్తున్నారు.