గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By DV
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (22:22 IST)

వేశ్య పాత్ర చేయ‌డంలేద‌ట‌! (వీడియో)

Anasuya still
సినిమా ద‌ర్శ‌కులు విడుద‌ల‌య్యేవ‌ర‌కు ఏదీ క‌రెక్ట్‌గా చెప్ప‌రు. ఇది తెలిసిందే. ఇప్పుడు ద‌ర్శ‌కుడు మారుతీ ‘పక్కా కమర్షియల్’ చేస్తున్నాడు. గోపీచంద్ హీరో. అందులో ఓ వేశ్య పాత్ర‌ను అన‌సూయ‌ను అడిగార‌ని టాక్ వుంది. ఇటీవ‌లే న‌టిగా వైవిధ్య‌మైన పాత్ర‌లు చేయాల‌నేది నా కోరిక అని స్టేట్‌మెంట్ ఇచ్చింది. రంగ‌స్థ‌లంలో సెక్సీ రంగ‌మ్మ‌త్త‌గా న‌టించింది.

తాజాగా కార్తికేయ న‌టిస్తున్న  ‘చావు కబురు చల్లగా’లో  మాస్ సాంగ్‌లో న‌టించింది. ఈ కార‌ణాల‌తోనే రంగ‌మ‌త్త మారుతీ సినిమాలో వేశ్య‌గా న‌టిస్తుంద‌ని వార్త వినిపిస్తోంది. కానీ దీని గురించి ఆమె ఎటువంటి క్లారిటీ ఇవ్వ‌లేదుకానీ. ద‌ర్శ‌కుడు మాత్రం తమ సినిమాలో అలాంటి పాత్రలేవీ లేద‌ని చెబుతున్నాడు.

ఒక వేళ వుంటే అన‌సూయ వ‌దులుకోద‌ని ఫిలింన‌గ‌ర్‌లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. అప్పుడెప్పుడో అల్లు అర్జున్ సినిమాలో అనుష్క వేశ్య‌గా న‌టించింది కూడా. మ‌రి యూవీ క్రియేషన్స్, గీత ఆర్ట్స్ 2 బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంటే పాత్ర ఎటువంటిదైనా అన‌సూయ వ‌దులుకుంటుందా! అని చెప్పుకుంటున్నారు. సో. మ‌రింత క్లారిటీ కోసం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.