శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 మార్చి 2021 (14:05 IST)

బుట్టబొమ్మకు ప్రత్యేక బహుమతి.. ఎవరిచ్చారు?

సాధారణంగా తాము నటించిన చిత్రాలకు సంబంధించిన కాస్ట్యూమ్స్‌, ఇతర వస్తు సామాగ్రి నచ్చినా చిత్రబృందం అనుమతితో అగ్ర నటీనటులు వాటిని తమ వెంట తీసుకెళుతుంటారు. లేదా, చిత్రబృందమే వారికి బహుమతిగా ఆ వస్తువులను అందిస్తుంది. 
 
అలాగే, బుట్టబొమ్మ పూజాహెగ్డేకి కూడా ‘అల.. వైకుంఠపురములో..’ టీమ్‌ నుంచి ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ లభించింది. ఆమె కోసం షూట్‌లో వాడిన ఓ సైకిల్‌ని హైదరాబాద్‌ నుంచి ముంబైకి పంపించిందట‌. ఈ విషయాన్ని ఇటీవల పూజాహెగ్డే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
 
‘‘బుట్టబొమ్మ’ పాటలోని సైకిల్‌కి నేను ఫిదా అయిపోయాను. అది నాకెంతో నచ్చింది. మొదటిసారి షూట్‌లో దాన్ని చూడగానే.. చక్కగా అలంకరించారు అనిపించింది. సైకిల్‌పై నేను మనసుపారేసుకున్నానని తెలుసుకున్న నిర్మాణబృందం నాకోసం ప్రత్యేకంగా దానిని హైదరాబాద్‌ నుంచి ముంబైకి పంపించారు.
 
ప్రస్తుతం ఆ సైకిల్‌ని మా నివాసంలో భద్రంగా దాచాను. ఆ సినిమా నుంచి నాకు లభించిన మధురమైన జ్ఞాపకమది’ అని పూజాహెగ్డే తెలిపారు. పూజాహెగ్డే సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె ‘ఆచార్య’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’, ‘సర్కస్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు. దీనితోపాటు విజయ్‌ 65వ చిత్రంలోనూ పూజా భాగమైనట్లు కోలీవుడ్‌ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.