జనసేన తీర్థం పుచ్చుకున్న 'అత్తారింటికి దారేది' నిర్మాత సినీ నిర్మాత
తెలుగు చిత్రపరిశ్రమలోని ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన బీవీఎస్ఎన్ ప్రసాద్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన సినీ హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పవన్ జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కాగా, గతంలో పవన్ కళ్యాణ్- పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. గతంలో ఎన్నడూ రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి చూపని ఈ నిర్మాత ఇపుడు ఉన్నట్టుండి జనసేన తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ హోమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సు కోసం జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ హోం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ హోమంలో ఆయన పాల్గొన్నారు. అలాగే, కార్యాలయ ప్రాంగణంలో భనన నిర్మాణం కోసం పవన్ భూమి పూజ నిర్వహించారు.
సోమవారం సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ పూజలో పట్టు వస్త్రాలను ధరించిన పవన్ కళ్యాణ్... యాగశాలకు వచ్చి దీక్షలో కూర్చొన్నారు. ఇందుకు సంబంధించిన జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. విగ్రహం, యంత్రం, హోమం ఆలంబనగా సోమవారం ఉదయం ప్రారంభమైన ఈ యాగం కూడా మంగళవారం కూడా కొనసాగనుంది.
ఈ యాగానికి గణపతి పూజతో స్వయంగా అంకురార్పణ చేసి దేవతామూర్తులకు ప్రణతులు అర్పించారు. యాగశాలలో ఐదుగురు దేవతామూర్తులను అభిముఖంగా యంత్రస్థాపన చేశారు. యాగ సంప్రదాయ మేళవింపులో భాగంగా మామిడి తోరణాలు, పూల హారాలు, అరటిజెట్లు, రంగవల్లులతో యాగశాలను ఆకర్షణీయంగా అలంకరించారు. కేవలం రుత్వికులు మాత్రమే సంప్రదాయబద్ధంగా ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు.
హనుమంతుడి పక్క సీటు ధర భారీ రేటు!
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా "ఆదిపురుష్" క్రేజ్ మొదలైంది. ఈ నెల 16వ తేదీన భారీ స్థాయిలో ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది. ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఈ చిత్రం బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఆడియో ట్రైలర్ ఇటీవలే విడుదల చేశారు. ఈ సినిమా విడుదల కోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. కొందరు సినీ ప్రముఖులు భారీ ఎత్తున టికెట్స్ కొనుగోలు చేసి సినిమాపై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ప్రతి రామాలయానికి ఉచితంగా 101 టిక్కెట్స్‌ను ఇవ్వనున్నట్లు కొన్ని మీడియా సంస్థలు ప్రకటించాయి.
ఇకపోతే, ఈ సినిమా ప్రదర్శించే ప్రతి థియేటర్లో ఒక సీటుని ఆంజనేయుడి కోసం ఖాళీగా ఉంచాలని చిత్రబృందం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఖాళీ సీటు పక్కన ఉండే సీటు టికెట్కు సంబంధించి రూమర్స్ మొదలయ్యాయి. రామాయణ పారాయణం జరిగే ప్రతిచోటికీ హనుమంతుడు వస్తాడు అనే నమ్మకంతో.. ప్రతి థియేటర్లో ఒక సీటును ఖాళీగా ఉంచుతున్నారు.
దీంతో కొందరు ఆ సీటు పక్క టికెట్‌ను భారీ ధరకు అమ్ముతున్నారట. ఈ విషయంపై 'ఆదిపురుష్' నిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేసింది. "ఆదిపురుష్' టికెట్స్ విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి. హనుమంతుడి పక్క సీటు టికెట్ను భారీ ధరకు అమ్ముతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అన్నీ సీట్ల ధరకే ఆ టికెట్ ధర కూడా అమ్ముతున్నారు. దానికి ఎలాంటి ప్రత్యేకత లేదు. ఇలాంటి పుకార్లు సృష్టించొద్దు" అని ట్వీట్ చేసింది.