శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 28 జూన్ 2018 (18:19 IST)

వాళ్లిద్దరూ భార్యాభర్తలే కాదు.. అర్థరాత్రి నా తలుపు తట్టారు: పూనమ్ కౌర్

అమెరికా సెక్స్ దందా వ్యవహారంపై హీరోయిన్ పూనమ్ స్పందించింది. ఈ సెక్స్ రాకెట్‌ వ్యవహారంలో ప్రధాన నిందితులైన కిషన్, చంద్రకళలు భార్యాభర్తలే కాదని పూనమ్ స్పష్టం చేసింది. చికాగో సెక్స్ రాకెట్ వ్యవహారంలో ప్ర

అమెరికా సెక్స్ దందా వ్యవహారంపై హీరోయిన్ పూనమ్ స్పందించింది. ఈ సెక్స్ రాకెట్‌ వ్యవహారంలో ప్రధాన నిందితులైన కిషన్, చంద్రకళలు భార్యాభర్తలే కాదని పూనమ్ స్పష్టం చేసింది. చికాగో సెక్స్ రాకెట్ వ్యవహారంలో ప్రధాన నిందితులు కిషన్ మోదుగమూడి, అతని భార్య చంద్రలను అమెరికా పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్న నేపథ్యంలో.. కిషన్, చంద్ర సంబంధంపై పూనమ్ నోరు విప్పింది. అమెరికాలో డబ్బు ఆశ చూపెట్టో లేక భయపెట్టో మన దేశ అమ్మాయిలను లొంగదీసుకుంటారని, ఇలా మోసం పోతున్న అమ్మాయిలను కాపాడాలని ప్రధాని మోదీకి పూనమ్ కౌర్ విజ్ఞప్తి చేసింది. 
 
ఇక సెక్స్ స్కాండల్‌లో పట్టుబడిన కిషన్-చంద్రలు అసలు భార్యాభర్తలే కాదని, లగ్జరీ జీవితం గడిపేందుకు, ఇలాంటి నేరాలు చేసేందుకే వాళ్లిద్దరూ అలా నటిస్తున్నారని పూనమ్ ఆరోపణలు చేసింది. వాళ్లిద్దరూ లైఫ్ పాట్నర్స్ కాదని.. క్రైమ్ పాట్నర్స్ అని పూనమ్ తెలిపింది. ఈ సందర్భంగా ఓసారి తాను అమెరికా వెళ్లినప్పుడు జరిగిన సంఘటనను పూనమ్ ప్రస్తావించింది. తాను బస చేసిన హాటల్ దగ్గరకు కిషన్-చంద్రలకు సంబంధించిన ఓ వ్యక్తి అర్థరాత్రి సమయంలో వచ్చి గది తలుపు తట్టాడని పూనమ్ వెల్లడించింది. ఆ సమయంలో అతని ప్రవర్తనకు చిర్రెత్తుకొచ్చిందని.. దాంతో చెంప ఛెల్లుమనిపించానని పూనమ్ తెలిపింది.
 
కాగా..  మొన్నిటి వరకు క్యాస్టింగ్ కౌచ్ వివాదం టాలీవుడ్‌ని కుదిపేయగా.. ప్రస్తుతం చికాగో సెక్స్ రాకెట్ టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. అయితే సెక్స్ రాకెట్ వ్యవహారంలో ఇప్పటివరకూ కొంత మంది నటీమణులు సంచలన విషయాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే.